తెలంగాణ బడ్జెట్.. భట్టి కామెంట్స్

Published : Feb 22, 2019, 12:13 PM IST
తెలంగాణ బడ్జెట్.. భట్టి కామెంట్స్

సారాంశం

దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డిన అమర జవాన్లకు నివాళులర్పించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 

దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డిన అమర జవాన్లకు నివాళులర్పించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ముందగా శాసనసభ ప్రారంభం కాగానే పుల్వామా అమరులకు సంతాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.

అనంతరం భట్టి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై భట్టి స్పందించారు. అమరుల కుటుంబీకులకు రూ.25లక్షల పరిహారం అందించడం చాలా గొప్ప విషయమన్నారు. ఇందుకు తాను మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.

త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. దేశంలో కుట్రలు జరిగుతున్నాయని..వాటిని రాష్ట్రాలన్నీ కలిపి ఎదురుకోవాలని సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: తెలంగాణ‌లో చేప‌ల వ‌ర్షం.. ఆకాశం నుంచి చేప‌లు, ఎగ‌బ‌డ్డ జ‌నాలు
TGSRTC: మీ ఇంటి వరకు ఆర్టీసీ సేవలు.. కేవలం బస్సులకే పరిమితం కాదు, ఇకపై ఆటోలు కూడా