చెట్టినాడు గ్రూప్‌పై ఐటీ దాడులు: దేశంలోని 50 ప్రాంతాల్లో సోదాలు

By narsimha lodeFirst Published Dec 9, 2020, 2:41 PM IST
Highlights

చెట్టినాడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై  బుధవారం నాడు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబైతో పాటు 50 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్: చెట్టినాడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై  బుధవారం నాడు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబైతో పాటు 50 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చెట్టినాడ్ గ్రూప్‌పై చెన్నైలో సీబీఐ కేసు నమోదు చేసింది.దీంతో అధికారులు సోదాలు చేస్తున్నారు. నిర్మాణం, సిమెంట్, పవర్, స్టీల్ బిజినెస్‌ రంగాల్లో  చెట్టినాడ్ సంస్థ వ్యాపారాలు నిర్వహిస్తోంది.

చెట్టినాడ్ చైర్మన్ ముత్తయ్య నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. 2015లో కూడా పన్ను ఎగువేతకు సంబందించి ఐటీ అధికారులు ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

ఏకకాలంలో దేశంలోని 50 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సిఉంది.

 

 

click me!