ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు.. బైరి నరేష్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు!

By Sumanth KanukulaFirst Published Jan 2, 2023, 1:32 PM IST
Highlights

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ పోలీసుల విచారణలో నేరం అంగీకరించాడు. ఉద్దేశపూర్వకంగానే తాను అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా నరేష్‌ ఒప్పుకున్నాడు.

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ పోలీసుల విచారణలో నేరం అంగీకరించాడు. ఉద్దేశపూర్వకంగానే తాను అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా నరేష్‌ ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. బైరి నరేష్‌పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్టుగా పోలీసులు కోర్టుకు తెలిపారు. నలుగురు ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. మరోవైపు ఉద్దేశపూర్వకంగానే బైరి నరేష్‌ను కార్యక్రమానికి పిలిచినట్టు కార్యక్రమ నిర్వాహకుడు హనుమంతు ఒప్పుకున్నాడు.

ఇక, డిసెంబరు 19న వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో జరిగిన సభలో అయ్యప్ప స్వామిపై నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఉన్న వీడియో వైరల్‌ కావడంతో.. నరేష్‌కు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. ఇక, నరేష్‌పై కొడంగల్‌తో పాటు పలు పోలీసు స్టేషన్‌లలో కేసు నమోదైంది. 

Also Read: అయ్యప్పస్వామిపై వ్యాఖ్యలు... బైరి నరేష్‌కు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలింపు

అయితే నరేష్‌ను పోలీసులు వరంగల్‌లో అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్నప్పటికీ నరేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో..  సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ట్రేస్ చేసిన పోలీసులు అతడిని పట్టుకున్నారు.

click me!