నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం.. గెడ్డన్న ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత, భైంసాను ముంచెత్తిన వరద

Siva Kodati |  
Published : Jul 09, 2022, 04:45 PM IST
నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం.. గెడ్డన్న ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత, భైంసాను ముంచెత్తిన వరద

సారాంశం

ఎగువ ప్రాంతాలతో పాటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గెడ్డన్న వాగులోకి భారీగా వరద నీరు పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేశారు. దీంతో వరద నీరు భైంసా పట్టణాన్ని ముంచెత్తింది.   

తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసాను వరద నీరు ముంచెత్తింది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ఆర్ గార్డెన్స్ లో చిక్కుకున్న ఆరుగురిని బోటు ద్వారా రక్షించారు పోలీసులు. జిల్లా మొత్తం జల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. పెద్ద మొత్తం పంట నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తడం వల్ల ఒక్కసారిగా వరద పోటెత్తినట్లు తెలుస్తోంది. 

కాగా.. తెలంగాణ మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. శుక్రవారం, శనివారాల్లో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు (64-114 మి.మీ.) కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రిచింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌లు (204 మిమీ కంటే ఎక్కువ భారీ వర్షం), మ‌రి కొన్ని జిల్లాల‌కు ఆరెంజ్ అలర్ట్‌లు (115-204 మిమీ) జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో అస‌వ‌ర‌మైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల యంత్రాంగాల‌ను ఆదేశించింది. అయితే హైద‌రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, నగరంలోని కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీవ్ర వానలు సంభవించే అవకాశం ఉంద‌ని చెప్పింది.

ALso Read:weather report : అలెర్ట్.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే..

జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని ఐసోలేటెడ్ ప్రాంతాలకు ఐఎండీ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అయితే మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. 

IMD సర్క్యులర్ ప్రకారం  హైదరాబాద్‌లో వర్షాల వ‌ల్ల లోతట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని, ట్రాఫిక్ ర‌ద్దీ, అలాగే విద్యుత్, నీరు, ఇతర సామాజిక అవాంతరాలు ఏర్ప‌డే అవ‌కాశం  ఉంద‌ని పేర్కొంది. జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు రైలు లేదా రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడిందని కూడా తెలిపింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో పంట నష్టం లేదా వ్యవసాయ భూములు నీట మునిగే అవకాశం కూడా ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఆయా శాఖ‌ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఐఎండీ సూచించింది. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?