మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ శనివారం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.

ALso Read:మారేడ్ పల్లి ఇన్స్ పెక్టర్ నాగేశ్వరరావు పై రేప్ కేసు నమోదు..
ఫిర్యాదు చేసిన మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ హస్తినాపురంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 7వ తేదీన రాత్రి 12 గంటలకు ఇన్స్పెక్టర్ తనను రేప్ చేశారని తీవ్రంగా ఆరోపించింది. దీనికి అడ్డువచ్చిన తన భర్త తలపగులగొట్టారని పేర్కొంది. ఆ తర్వాత తమ ఇద్దరినీ చంపేందుకు పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని బయటకు తీసుకెళ్లారని తెలిపారు. అయితే ఇబ్రహీంపట్నంలో వాహనానికి యాక్సిడెంట్ అయ్యిందని, దీంతో తమ ప్రాణాలు దక్కాయని పేర్కొన్నారు. ఒక వేళ కారుకు ప్రమాదానికి గురి కాకుండా ఉంటే ఇన్స్ పెక్టర్ తమను ఇద్దరినీ చంపేసి ఎక్కడో పడేసి ఉండేవాడని ఆరోపించారు. ఈ నిజాలు ఎప్పటికీ బయటకు వచ్చేవి కావని అన్నారు. కాగా నిందితుడిపై తెల్లవారుజామున వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యింది.