నిమజ్జనం గందరగోళం : రేపటి నిరసన కార్యక్రమాలకు బీజేపీ మద్ధతు.. (వీడియో)

By AN TeluguFirst Published Sep 15, 2021, 5:01 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరితోనో పొత్తు పెట్టుకుని, ఏదో ఒకటి అడ్డంకులు తీసుకువస్తున్నారన్నారు. గత రెండు సంవత్సరాలుగా నిమజ్జనాన్ని ఒక విమర్శనాత్మకంగా చూస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీళ్ల లాగ మారుస్తామన్నారని.. కానీ కనీసం పొల్యూషన్ వాటర్ రాకుండా కూడా ఆపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.  

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం మీద ఏర్పడిన గందరగోళం మీద హైదరాబాద్ బిజెపి సిటీ ఆఫీస్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు మండిపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం సమావేశం జరిగింది. దీంట్లో ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరముల నుండి భాగ్యనగరంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక మండపాలు, నిమజ్జనం జరుగుతున్నాయని,  నవరాత్రులు జరుపుకుని నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. 

"

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరితోనో పొత్తు పెట్టుకుని, ఏదో ఒకటి అడ్డంకులు తీసుకువస్తున్నారన్నారు. గత రెండు సంవత్సరాలుగా నిమజ్జనాన్ని ఒక విమర్శనాత్మకంగా చూస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీళ్ల లాగ మారుస్తామన్నారని.. కానీ కనీసం పొల్యూషన్ వాటర్ రాకుండా కూడా ఆపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.  

గణపతి నిమజ్జనం మీద నెలకొన్న గందరగోళానికి వ్యతిరేకంగా రేపు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి గణేష్ ఉత్సవ సమితి, భారతీయ జనతా పార్టీ మద్దతు ఉందని వారు తెలిపారు. హైదరాబాద్ లోని నాలుగు ప్రదేశాలలో రేపు నిరసన కార్యక్రమం జరుగుతుందని, దీనికి బీజేపీ మద్దతు ఉంటుందని తెలిపారు. నిమజ్జనం మీద క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

click me!