భద్రాచలం ఆలయంలో ప్రసాద కౌంటర్ సీజ్ కు పోలీసుల యత్నం: ఉద్యోగుల నిరసన

By narsimha lodeFirst Published Jan 9, 2023, 6:30 PM IST
Highlights


భద్రాచలం  సీతారామచంద్రస్వామి ఆలయంలో లడ్డూ  విక్రయశాలను  సీజ్  చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను  ఆలయ ఉద్యోగులు  అడ్డుకున్నారు. ఆలయ ప్రాంగణంలో  ఉద్యోగులు  నిరసనకు దిగారు

భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి  ఆలయంలో  లడ్డూ విక్రయ శాలను సీజ్ చేసేందుకు  వెళ్లిన  పోలీసులను  ఆలయ ఉద్యోగులు  అడ్డుకున్నారు.  ఆలయ ప్రాంగంణంలో  ఉద్యోగులు  నిరసనకు దిగారు.  భద్రాచలం సీతారామచంద్రస్వామి  ఆలయంలో  బూజు పట్టిన  లడ్డూలతో పాటు  ప్రసాదాలను  విక్రయించారని  భక్తులు ఆందోళన వ్యక్తం  చేశారు.ఈ విషయమై  మీడియాలో పెద్ద ఎత్తున  కథనాలు వచ్చాయి. బూజు పట్టిన  లడ్డూ ప్రసాదాలున్న ప్రసాదాల విక్రయశాలను  సీజ్  చేసేందుకు  సోమవారం నాడు పోలీసులు వచ్చారు. అయితే  లడ్డూ ప్రసాద కౌంటర్ ను సీజ్ చేయకుండా  ఆలయ ఉద్యోగులు  అడ్డుకుని నిరసనకు దిగారు.  

ఈ విషయమై దేవాలయ శాఖకు  చెందిన అధికారులు  కాకుండా  పోలీసులు రంగ ప్రవేశం చేయడంపై  ఆలయ ఉద్యోగులు  అడ్డుకున్నారు.  లడ్డూ ప్రసాదాల విక్రయ  కౌంటర్ ను  సీజ్  చేయకుండా  నిరసనకు దిగారు. ఈ నెల  2వ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని  పెుద్ద ఎత్తున లడ్డూల తయారీ  చేశారు. అయితే  ఆ రోజున భక్తులకు విక్రయించగా మిగిలిన లడ్డూలను  భద్రపర్చడంలో జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో లడ్డూలకు బూజు పట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇక్కడ బూజుపట్టిన లడ్డూరు లిక్రయించబడును అంటూ  కొందరు భక్తులు ప్రసాదం విక్రయించే  కౌంటర్ వద్ద  పేపర్ పై రాసి అంటించి తమ నిరసనను వ్యక్తం  చేశారు.ఈ విషయమై  మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో  ఉన్నతాధికారుల  ఆదేశాల మేరకు  పోలీీసులు  ప్రసాద కౌంటర్  సీజ్  చేసేందుకు  వచ్చారు. పోలీసులను  ఆలయ సిబ్బంది  అడ్డుకున్నారు.
 

click me!