పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉంది: మంత్రి పువ్వాడ అజయ్

Published : Jul 19, 2022, 11:59 AM ISTUpdated : Jul 19, 2022, 12:02 PM IST
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉంది: మంత్రి పువ్వాడ అజయ్

సారాంశం

పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళవారం మంత్రి పువ్వాడతో కలిసి ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. భారీ వర్షం, వరదల్లోనూ సీఎం కేసీఆర్ పునరావాస కేంద్రాలను పరిశీలించారని చెప్పారు. వరద భాదితులకు కేసీఆర్ తన పర్యటనతో భరోసా కల్పించారని తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని చెప్పారు. అలాగే రెండు నెలలకు సరిపడ రేషన్ అందజేస్తామని తెలిపారు. 

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా కృషి చేస్తున్నామని చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గోదావరి కరకట్టను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. భద్రాచలంలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

అయితే పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం పట్ణణానికి ముంపు పొంచి ఉందన్నారు. పోలవరం నుంచి నీటి విడుదల ఆలస్యం వల్ల గోదావరి వరద ఉధృతి పెరిగిందని అన్నారు. పోలవరం ఎత్తు పెంపుతో భద్రాచలం వద్ద నిరంతరం 45 అడుగుల మేర నీటి ప్రవాహం ఉంటుందని చెప్పారు. పోలవరం వల్ల తెలంగాణ భూభాగానికి ముంపు ఉందని ముందు నుంచే చెబుతున్నామని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌లో పలు మండలాలకు ముప్పు ఉందని తెలిపారు. భద్రాచలానికి అనుకొని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మిగిలిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇదేరకమైన కామెంట్స్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్