ఫేస్ బుక్ ప్రేమ.. ప్రియుడి కోసం హైదరాబాద్ వచ్చి...

Published : May 08, 2019, 03:24 PM IST
ఫేస్ బుక్ ప్రేమ.. ప్రియుడి కోసం హైదరాబాద్ వచ్చి...

సారాంశం

ఫేస్ బుక్ లో పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమికుడిని కలుసుకునేందుకు  బెంగాల్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక ఓ లాడ్జ్ లో శవమై తేలింది. ఈ సంఘటన హైదరాబాద్ శివారు వనస్థలీపురంలో చోటుచేసుకుంది.

ఫేస్ బుక్ లో పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమికుడిని కలుసుకునేందుకు  బెంగాల్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చి ఓ లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ శివారు వనస్థలీపురంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగాల్ కి చెందిన సంగీత ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. ఫేస్ బుక్ ద్వారా యువతికి హైదరాబాద్ లోని ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తన ప్రేమికుడి కోసం ఇటీవల సంగీత బెంగాల్ నుంచి హైదరాబాద్ కి వచ్చింది.

మూడు రోజులుగా వనస్థలీపురంలోని అభ్యుదయ నగర్ లోని ఓ లాడ్జ్ లో ఉంది. ఆ లాడ్జిలో ఆమెతోపాటు... లోకేష్ అనే ఓ యువకుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం  రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ఆ తర్వాత సంగీత ఆ లాడ్జిలో శవమై కనిపించింది. 

  దీంతో సంగీత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలిసింది. సంగీతకు 48ఏళ్లు కాగా, లోకేష్‌కు 28 ఏళ్లు ఉండొచ్చని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu