హైదరాబాద్ లో కలకలం సృష్టించిన బేగం బజార్ పరువు హత్య కేసులో మృతుడి భార్య సంజన ధర్నాకు దిగింది. న్యాయం కావాలంటూ రెండు నెలల బాబుతో బేగంబజార్ కూడలిలో బైఠాయించింది.
హైదరాబాద్ : నగరంలోని begum bazar honor killing నేపథ్యంలో బేగంబజార్ కూడలిలో మృతుడు నీరజ్ భార్య sanjana రెండు నెలల వయసున్న బాబుతో ధర్నాకు దిగింది. సంజన బంధువులు కూడా ఇందులో పాల్గొన్నారు. నిందితులను ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. తన సోదరులే హత్య చేసినట్లు సంధ్య ఆరోపించింది. ఏడాదిగా తన సోదరులు బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తన సోదరులు వెనక్కి తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హత్య చేసిన వారిని గుర్తు పట్టేందుకు సంజనను పోలీసులు పీఎస్ కు తీసుకువచ్చారు.
భయపడి పారిపోయారు…
మరోవైపు సంజన తల్లి మధు బాయ్ మీడియాతో మాట్లాడారు…‘నా కూతురు సంసారాన్ని నాశనం చేశారు. హత్య చేసిన వాళ్లని ఉరి తీయాలి. నీరజ్ హత్యలో మా కుటుంబం ప్రమేయం లేదు. గత ఆరు నెలలుగా నా కూతురిని, అల్లుడిని చంపుతామని కొందరు బెదిరించారు. వారు ఎవరనేది తెలియదు. హత్య జరిగిన సమయంలో నా కుమారుడు రితేష్, బావ కుమారులు నలుగురు ఇంట్లోనే ఉన్నారు. హత్యతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. హత్య జరిగిన విషయం తెలుసుకుని భయపడి ఇంట్లో నుంచి పారిపోయారు’ అని మధు బాయి తెలిపారు.
undefined
ఇలా జరుగుతుందని ఊహించలేదు..
అంజనా సోదరి మమత మాట్లాడుతూ… ఏడాదిగా సంజనతో మా కుటుంబానికి మాటలు లేవు. మా అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెండు నెలలుగా సంజన నాతో ఫోన్లో మాట్లాడుతుంది. ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆమెని దూరం పెట్టాం. భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. హత్యతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు’ అని తెలిపారు.
ఆందోళన విరమించిన కుటుంబ సభ్యులు..
నీరజ్ హత్య నేపథ్యంలో షాహినయత్ గంజ్ పీఎస్ ఎదుట అతని కుటుంబ సభ్యులు, బంధువులు చేపట్టిన ఆందోళనను విరమించారు. అంతకుముందు గంట పటు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితులను. తమ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజాసింగ్ చొరవతో కుటుంబ సభ్యులు, వ్యాపారులు ఆందోళన విరమించారు.
కాగా, హైదరాబాద్ బేగంబజార్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమ పెళ్లి చేసుకున్న నీరజ్ పన్వార్ అనే యువకుడిని ఐదుగురు వ్యక్తులు శుక్రవారంనాడు అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఐదుగురు నిందితులను హైదరాబాదు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు కర్ణాటక రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నారు.
కాగా, హైదరాబాద్ నడిబొడ్డున మరో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఇటీవల సరూర్నగర్లో నాగరాజును అమ్మాయి కుటుంబ సభ్యులు కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ చేపల మార్కెట్ సమీపంలో ఒక యువ వ్యాపారి శుక్రవారం రాత్రి Hyderabad honor killingకు గురయ్యాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకే ఆయనను అంతమొందించిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏసీపీ సతీష్ కుమార్, సీఐ అజయ్ కుమార్ లు తెలిపిన వివరాల ప్రకారం…బేగంబజార్ కోల్సావాడికి చెందిన neeraj kumar panwar (22) పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజన (20)ను ఏడాదిన్నర కిందట love marriage చేసుకున్నాడు.
వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. ఈ క్రమంలో సంజన కుటుంబీకులు నీరజ్ మీద ఇంకా కక్షపెంచుకున్నట్లు తెలుస్తోంది. సంజన సోదరుడు నీరజ్ ను ఆరునెలలుగా చంపాలని చూస్తున్నాడు. వారం రోజుల నుంచి నీరజ్ షాప్ నుంచి ఇంటికి వెళ్లే వరకు ఏ టైంలో ఏం చేస్తున్నాడు.. అనే విషయాన్ని సంజన సోదరుడు గమనించాడు. శుక్రవారం వాతావరణం మేఘావృతమై ఉండటంతో పాటు.. జనసంచారం తక్కువగా ఉండటంతో.. ఇదే అదనుగా భావించి స్నేహితులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకుని రోడ్డు దాటుతుండగా వెనకనుంచి వచ్చి నీరజ్ మీద దాడి చేశారు. అతని తలపై గ్రానైట్ రాయితో మోదారు. ఆ తర్వాత కొబ్బరిబోండాల కత్తితో పొడిచి పారిపోయారు.