సబిత కార్యాలయం వద్ద ధర్నా: స్పృహతప్పి పడిపోయిన ఆర్ కృష్ణయ్య, ఆసుపత్రికి తరలింపు

Siva Kodati |  
Published : Sep 14, 2021, 04:18 PM ISTUpdated : Sep 14, 2021, 04:20 PM IST
సబిత కార్యాలయం వద్ద ధర్నా: స్పృహతప్పి పడిపోయిన ఆర్ కృష్ణయ్య, ఆసుపత్రికి తరలింపు

సారాంశం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అస్వస్థతకు గురయ్యారు. మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న గెస్ట్ టీచర్లకు మద్దతు తెలుపుతూ హైదరాబాదులోని బషీర్ బాగ్ లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం వద్ద బీసీ సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఓ ధర్నాలో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. వివరాల్లోకి వెళ్తే, మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న గెస్ట్ టీచర్లకు మద్దతు తెలుపుతూ హైదరాబాదులోని బషీర్ బాగ్ లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం వద్ద బీసీ సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్. కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్వస్థతకు గురైన కృష్ణయ్య ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది


 

PREV
click me!

Recommended Stories

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది