లొంగలేదనే బురద జల్లుతున్నారు.. బీసీ ఐఏఎస్‌కు మద్ధతుగా ప్రజా సంఘాల నిరసన

Siva Kodati |  
Published : Apr 06, 2022, 07:16 PM ISTUpdated : Apr 06, 2022, 07:17 PM IST
లొంగలేదనే బురద జల్లుతున్నారు.. బీసీ ఐఏఎస్‌కు మద్ధతుగా ప్రజా సంఘాల నిరసన

సారాంశం

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బీసీ, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.   

ఒక బలహీనవర్గ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ (Ias) అధికారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా (ranga reddy district collector) ఉండటంతో కొన్ని వర్గాలు ఓర్చుకోలేక ఆయనపై బురదజల్లుతున్నాయని ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓయూ యూనివర్సిటీలో ప్రజా సంఘాలు, బీసీ సంఘాల నేతలు ధర్నాలు నిర్వహించాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పటికే ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అమోయ్ కుమార్‌పై (amoy kumar ias) కొందరు కావాలనే పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమోయ్ కుమార్ రంగారెడ్డి కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా పరిధిలోని ఎన్నో ప్రభుత్వ భూములను ప్రయివేట్ పరం కాకుండా, కబ్జాలకు గురి కాకుండా కాపాడారని గుర్తుచేశారు. కొన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా, కొందరు ప్రతిపక్ష, అధికార పార్టీల నేతల కనుసన్నుల్లో ఉన్న భూములను కూడా ఎవరికీ భయపడకుండా కాపాడారని ప్రశంసించారు. ఆ శ్రమ వల్లే రంగారెడ్డి కలెక్టర్‌కి పలు వర్గాల నుండి గుర్తింపు వచ్చిందని  తెలిపారు. 

కానీ ఇప్పుడు ధరణిలో (dharani portal) ఉన్న సమస్యలను అలుసుగా తీసుకొని సమాజంలో పలుకుబడి ఉన్న నేతలు కావాలనే రంగారెడ్డి కలెక్టర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని ప్రజా సంఘాల నేతలు ఫైరయ్యారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గానే ఉంది. నిజాయితీగా పనిచేసే అధికారుల పట్ల ఇలాంటివి ఉపేక్షించబోమని ప్రభుత్వంలోని కీలక నేత ఒకరు వాఖ్యానించారు. అయితే ఒక భూమికి సంబంధించిన ధరణి అప్లికేషన్ పరిష్కరించలేదని, అది అక్రమంగా ఉండటంతో తిరస్కరించారనే కోపంతో జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్‌లోని ఒక కీలక వ్యక్తి పీఏ ఇదంతా చేయిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. 

ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలో కూడా ఇప్పటివరకు 1,25,185 ధరణి దరఖాస్తులు రాగా వాటిలో ఇప్పటివరకు 1,20,518 దరఖాస్తులను పరిష్కరించారు. ప్రతి రోజు సగటున 100 ధరణి అప్లికేషన్లు వస్తుండగా దాదాపు 80 నుండి 90 అప్లికేషన్ల వరకు అక్కడిక్కడే పరిష్కరించేలా రంగారెడ్డి కలెక్టర్ 24 గంటలు పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా కీలక జిల్లా కావటంతో ఆ జిల్లాకు బలహీన వర్గాల సామజిక వర్గానికి చెందిన వ్యక్తి కలెక్టర్‌గా ఉండటంతో కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 

దీంతో కావాలనే రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న ఐఏఎస్ అధికారిపై బురద జల్లి లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారుల అక్రమాలకు కలెక్టర్ లొంగకపోవటంతోనే ఇలాంటి విష ప్రచారానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి అధికారిపై ఎవరైనా లేని పోనీ అబద్దపు ప్రచారాలకు పాల్పడితే సహించబోమని ప్రజా, బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్