హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఓటు గల్లంతు... కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Sep 25, 2018, 3:26 PM IST
Highlights

తెలంగాణ లో దాదాపు 21 లక్షల ఓట్లు గల్లంతయినట్లు ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాయి. బిజెపి, టీఆర్ఎస్ లు ఈసీతో కుమ్మకై ఇలా ఓట్లను తొలగిస్తున్నట్లు కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఏకంగా ఓ ఎంపీ అభ్యర్థి పేరే ఓటర్ లిస్టు నుండి గల్లంతయింది.  

హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి 2014  సార్వత్రిక ఎన్నికల్లో ఆఫ్ (ఆమ్ ఆద్మీ) పార్టీ తరపున లుబ్నా సార్వత్ పోటీ చేశారు. ఆమె ఇటీవల ఓటర్ లిస్టును చెక్ చేయగా అందులో తన పేరు లేదు. తన వద్ద ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉన్నా ఓటర్ లిస్టులో పేరు మాత్రం లేదని సార్వత్ వాపోయారు. తెలంగాణ ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ లో తన ఓటర్ కార్డు నంబర్ సెర్చ్ చేస్తే నో రికార్డ్ పౌడ్ అని చూపిస్తుందని తెలిపారు.

తన చిరునామా కానీ, మొబైల్ నంబర్ కానీ మారలేదని...అలాంటిది తనకు సమాచారం లేకుండానే తన పేరును ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు పిర్యాదు చేసినట్లు లుబ్నా సార్వత్ స్పష్టం చేశారు.

ఎన్నికల కోసం సర్వం సిద్దం చేశామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోవాలని సూచించారు. ప్రజల ఓట్లను తొలగిస్తూ ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని ఎలా చెబుతారని సార్వత్ ప్రశ్నించారు.   

click me!