ముగిసిన డెడ్‌లైన్.. మరోసారి ఆందోళనకు సిద్ధమవుతోన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు

Siva Kodati |  
Published : Jul 23, 2022, 05:44 PM IST
ముగిసిన డెడ్‌లైన్.. మరోసారి ఆందోళనకు సిద్ధమవుతోన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు

సారాంశం

ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా బాసర ట్రిపుల్ ఐటీకి సెలవులు ప్రకటించింది.   

బాసర ట్రిపుల్ ఐటీలో ( basara iiit)  మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు విద్యార్ధులు. 12 డిమాండ్లు పరిష్కారం కాలేదని నిరసనలకు సిద్ధం పిలుపునిచ్చారు. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైన మెస్‌లపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు విద్యార్ధులు. అధికారులు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులకు ఇచ్చిన డెడ్ లైన్ శనివారం అర్ధరాత్రితో ముగియనుంది. అయితే విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు ప్రభుత్వం మూడు రోజుల సెలవు ప్రకటించింది. 

కాగా.. ఈ నెల 17న బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్‌ఛార్జ్ వీసీతో విద్యార్ధుల చర్చలు నిర్వహించారు. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైన మెస్ కాంట్రాక్టర్లను తొలగించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. మరికొన్ని డిమాండ్లను ఇన్‌ఛార్జ్ వీసీ ముందు వుంచారు విద్యార్ధులు. ఈ నెల 24 లోపు వీసీని నియమించాలని విద్యార్ధులు డెడ్ లైన్ పెట్టారు. లేనిపక్షంలో 25 నుంచి మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తాజాగా ఈ డెడ్‌లైన్ ముగియడంతో విద్యార్ధులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 

ALso REad:బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జ్ వీసీతో ముగిసిన విద్యార్ధుల చర్చలు.. 24 వరకు డెడ్‌లైన్, లేదంటే మళ్లీ ఆందోళనే

అంతకుముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని గత నెలలో వారం రోజులు పాటు క్యాంపస్‌లోనే ఆందోళన చేసిన ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌‌ చర్చలు జరిపి.. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే తాజాగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రెండు మెస్‌లలో ఫుడ్ పాయిజన్‌ ఘటన తీవ్ర కలకలం రేపింది. వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మరోసారి విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu