బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన: శనివారం రాత్రి నుండి మెస్ లో బైఠాయించి నిరసన

By narsimha lodeFirst Published Jul 31, 2022, 9:46 AM IST
Highlights

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని డిమాండ్  చేస్తూ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. సుమారు 3 వేల విద్యార్ధులు ఆందోళనకు దిగారు. మెస్ లోనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. 

బాసర: Basara IIT ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధులకు దిగారు శనివారం నాడు రాత్రి నుండి విద్యార్ధులు మెస్ లోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ1, ఈ2 విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు Mess  కాంట్రాక్టర్ ను మార్చాలని కొంత కాలంగా విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్టర్ ను మార్చేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే వెంటనే Contractor ను మార్చాాలని విద్యార్ధులుు డిమాండ్ ను మొదలు పెట్టారు. కాంట్రాక్టర్ ను మార్చడానికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాాల్సి ఉంటుందని ఇంచార్జీ వీసీ విద్యార్ధులకు చెప్పారు. ఈ విషయమై ఇంచార్జీ వీసీతో విద్యార్ధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో విద్యార్ధులు  ఆందోళనకు దిగారు. శనివారం నాడు రాత్రి భోజనం మానేసి మెస్ లోనే విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. సుమారు రెండు వేలకు పైగా విద్యార్ధులు మెస్ లోనే బైఠాయించి Protest చేస్తున్నారు. 

ఈ నెల 16న బాసర ట్రిపుల్ లో ఐటీ పుడ్ పాయిజన్ తో ఓ విద్యార్థి మరణించారు. ఉమ్మడి Warangal జిల్లాకు చెందిన మరో విద్యార్ధి ఆరోగ్యం విషమంగా ఉంది. పుడ్ పాయిజన్ కు గురైన విద్యార్ధులు కొందరు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మెస్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా కారణంగానే  పుడ్ పాయిజన్ అయినట్టుగా విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. 

మెస్ లో విద్యార్ధులకు ఏ రకమైన ఆహారం అందిస్తున్నారో అధికారులు పరిశీలించాలని కూడా విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు తమకు పోషాకాహరం అందించాలని కూడా విద్యార్ధులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న మెనూలో మార్పులు చేర్పులు చేయాలని కూడా విద్యార్ధులు కోరుతున్నారు. ఈ డిమాండ్లతో విద్యార్ధులు ఆందోళనకు దిగారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళనకు మద్దతుగా పేరేంట్స్ కమిటీ కూడా కార్యాచరణను ప్రకటించనుంది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల తల్లిదండ్రులు ఆదివారం నాడు హైద్రాబాద్ లో సమావేశం కానున్నారు.  విద్యార్ధులకు మద్దతుగా Parents  కమిటీ కూడా ఆందోళన చేసే అవకాశం ఉందని సమాచారం. మరో వైపు  బాసర ట్రిపుల్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ట్రిపుల్ ఐటీ వద్ద మూడంచెల భద్రతను కొనసాగుతుంది. విద్యార్ధులు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 

ఈ ఏడాది జూన్ మాసంలో బాసర ట్రిపుల్ ఐటీ వారం రోజుల పాటు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి Sabitha Indra Reddy చర్చించారు.ఈ చర్చలు ఫలించాయి. దీంతో జూన్ 20న మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో జూన్ 22 నుండి విద్యార్ధులు క్లాసులకు హాజరయ్యారు. అయితే మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చల్లో  కొన్ని డిమాండ్లు ఇంకా నెరవేర్చలేదని కూడా విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే బాసర ట్రిపుల్ ఐటీని  ఆదిలాబాద్ ఎంపీ Soyam Bapu Rao సందర్శించనున్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. 
 

click me!