కేసీఆర్ కూడా ఈడీ విచారణకు రావాల్సిన అవసరం ఉంది: బండి సంజయ్ సంచలనం

Published : Jul 21, 2022, 03:24 PM IST
కేసీఆర్ కూడా ఈడీ విచారణకు రావాల్సిన అవసరం ఉంది: బండి సంజయ్ సంచలనం

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈడీ విచారణకు రావాల్సిన అవసరం ఉందని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఇవాళ ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ జల్సాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.


హైదరాబాద్: Telangana  CM  కేసీఆర్ కూడా ఈడీ విచారణకు రావాల్సిన అవసరం ఉందని BJP  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.గురువారం నాడు Bandi Sanjay  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రూ. 800 కోట్లతో Pragathi Bhavan ను కట్టుకుని జల్సాలు చేస్తున్నావని కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్  కేబినెట్ లో తెలంగాణ ద్రోహులే ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారులను KCr  రోడ్డున పడేశారని  బండి సంజయ్ విమర్శించారు.

రైతులకు కేసీఆర్ రుణమాపీ చేయడం లేదన్నారు. తెలంగాణ సంపదను కేసీఆర్ దోచుకుంటున్నారని బండి సంజయ్  చెప్పారు. Congress  చీఫ్ Sonia Gandhi పై Enforcement Directorate  విచారణ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలవి అనసరపు రాద్ధాంతమన్నారు.దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆగష్టు 2వ తేదీ నుండి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నట్టుగా బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ కు ఎన్నికల ఫీవర్ కాదు బీజేపీ ఫీవర్ పట్టుకొందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.తెలంగాణలో ధాన్యం తడిసిపోవడానికి కేసీఆర్ కారణమని బండి సంజయ్ ఆరోపించారు.పంటలను కాపాడలేని సీఎం కేసీఆర్ ప్రజలను ఏం కాపాడుతారని ఆయన ప్రశ్నించారు.ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రను నిర్వహిస్తున్నట్టుగా ఆయన వివరించారు.

పోలవరంపై కేసీఆర్ స్పందించాకే మేం స్పందిస్తాం: బండి సంజయ్

Polavaram ప్రాజెక్టు  విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రుల వ్యాఖ్యల విషయమై కేసీఆర్ వ్యాఖ్యానించిన తర్వాతే తాను స్పందిస్తానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.  తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 తో బండి సంజయ్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో పాటు ప్రాజెక్టు గేట్లు ఆలస్యంగా ఎత్తడం వల్ల Bhadrachalam ముంపునకు గురైందని తెలంగాణ మంత్రి Puvvada Ajay Kumar ఆరోపించారు.ఈ  ఆరోపణలను ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తోసిపుచ్చారు. అంబటి రాంబాబుతో పాటు పలువురు మంత్రులు, వైసీపీ నేతలు కూడా ఈ విషయమై స్పందించారు. ఈ విషయమై  తాను కేసీఆర్ స్పందన  చూసిన తర్వాత వ్యాఖ్యానిస్తానని బండి సంజయ్ తేల్చి చెప్పారు.  పోలవరం నిర్మాణంపై అభ్యంతరం లేదని గతంలోనే కేసీఆర్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు