హైదరాబాద్‌లో యూట్యూబర్ డీనా ఆత్మహత్య.. వ్యుస్ రాకపోవడంతోనే..!

Published : Jul 21, 2022, 02:41 PM IST
 హైదరాబాద్‌లో యూట్యూబర్ డీనా ఆత్మహత్య.. వ్యుస్ రాకపోవడంతోనే..!

సారాంశం

హైదరాబాద్‌లో ఓ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకున్నారు. యూట్యూబర్ డీనా ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. 

హైదరాబాద్‌లో ఓ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకున్నారు. యూట్యూబర్ ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యూట్యూబ‌లో లైవ్ గేమ్స్‌ ఆడుతున్నాడు. యూట్యూబ్‌లో selflo గేమ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే లైవ్ గేమ్స్ ఆడుతూనే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్రెషన్‌తోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన సైదాబాద్‌లో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. 

యూట్యూబ్‌లో వ్యూస్ పెరగడం లేదంటూ డీనా  కొంతకాలంగా ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే  భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గేమ్‌ ఆడుతూ తన బాధను చెప్పుకున్నారు. ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచనలు చేశారు. తర్వాత కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. డీనా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆత్మహత్యకు 8 గంటల ముందే సూసైడ్ లెటర్‌ను డీనా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇక, డీనా తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి డీఆర్‌డీవోలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు