మోడీ, అమిత్ షాలతో బండి సంజయ్, లక్ష్మణ్‌ భేటీ... ఏర్పాట్లు బాగున్నాయన్న ప్రధాని

By Siva KodatiFirst Published Jul 2, 2022, 9:44 PM IST
Highlights

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి రోజు ముగిశాయి. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , ఎంపీ లక్ష్మణ్ లతో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

హైదరాబాద్ లో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల (bjp national executive meeting) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) మరో నేత లక్ష్మణ్ తో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు అద్భుతంగా వున్నాయని బండి సంజయ్, లక్ష్మణ్ లను ప్రశంసించారు ప్రధాని మోడీ. 

అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని... హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ కు కేంద్రంగా చేశారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నేతలు అత్యాచారాలు, దందాలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రెస్ మీట్ లు పెట్టి రెండు రోజులు కేసీఆర్ హడావుడి చేస్తారంటూ సెటైర్లు వేశారు. 

ALso REad:మోడీ వస్తే ప్రోటోకాల్ పాటించలేదు.. ఆయనకు రాజకీయాలంటే సర్కస్సే : కేసీఆర్‌పై స్మృతీ ఇరానీ ఫైర్

మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలిరోజు ముగిశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలు, కేడర్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. 

ఇకపోతే.. తెలంగాణకు ప్రధాని వస్తే.. కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదని కేంద్రమంత్రి స్మతీ ఇరానీ మండిపడ్డారు. కేసీఆర్ విధానాలు దేశం ఎప్పుడూ ఆమోదించలేదని.. ఆయనకు రాజకీయాలంటే సర్కస్ అయ్యాయని ఆమె దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను తాము ఫాలో అవ్వమని స్మృతీ ఇరానీ అన్నారు. 11 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు అందాయని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టీలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలు అద్బుతమని స్మృతీ ఇరానీ ప్రశంసించారు. దేశంలో అవినీతి నిర్మూలనకు ప్రధాని మోడీ (narendra modi) కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, కశ్మీర్ లోని బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని స్మృతీ ఇరానీ మండిపడ్డారు. రాజ్యాంగ ఉల్లంఘనకు కేసీఆర్ (kcr) మారు పేరని ఆమె వ్యాఖ్యానించారు. 
 

click me!