హిందువులు బాధపడుతుంటే దారుస్సలాంలో సంబరాలు.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై బండి సంజయ్ అసంతృప్తి

Published : Sep 07, 2022, 05:48 PM IST
హిందువులు బాధపడుతుంటే దారుస్సలాంలో సంబరాలు.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై బండి సంజయ్ అసంతృప్తి

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం  ట్యాంక్‌ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం  ట్యాంక్‌ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సజయ్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు సరిగా లేక హిందువులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిమజ్జన ఏర్పాట్లు చేయాల్సిన మంత్రి కేటీఆర్ నాస్తికుడని విమర్శించారు. దేవుడిని నమ్మని వ్యక్తికి మున్సిపల్ శాఖ ఇస్తే.. వినాయక నిమజ్జనం ఏర్పాట్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు.  హిందువులు బాధపడుతుంటే దారుస్సలాంలో సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వినాయక విగ్రహాలను హిందువులు ట్యాంక్‌బండ్‌లోనే నిమజ్జనం చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే సద్ది కట్టుకుని రావాలని కోరారు. 

హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో హిందువుల పరిస్థితి  అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళనకు భయపడి గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. యుద్దప్రతిపాదికన ప్రభుత్వం గణేష్ నిమజ్జనంకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు నోరు తెరిస్తే అబద్దాలేనని విమర్శించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?