కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసినందునే బండి సంజయ్‌ను తప్పించారు.. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే: వీహెచ్

Published : Jul 08, 2023, 05:49 PM IST
కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసినందునే బండి సంజయ్‌ను తప్పించారు.. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే: వీహెచ్

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్ మాట్లాడుతూ..  బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒక్కటేననే ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టే పార్టీ రాష్ట్ర యూనిట్‌కు అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తొలగించారని చెప్పారు.  

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ హనుమంతరావు అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటే అని అన్నారు. రాహుల్ గాంధీ అన్నట్టు బీఆర్ఎస్ కచ్చితంగా బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒక పరిమితి మేరకే విమర్శలు చేసుకుంటాయని అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా బండి సంజయ్ మాట్లాడాడు కాబట్టే.. ఆయనను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. 

దేశంలో ఇప్పుడు రాహుల్ హవా నడుస్తున్నదని వీహెచ్ అన్నారు. ప్రజల్లో రాహుల్ గాంధీకి క్రేజ్ ఏర్పడిందని వివరించారు. అబ్ కీ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆయన చెప్పారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీసీలు, మైనార్టీలు వర్గాలు మద్దతుగా నిలిచాయని, అందుకే అక్కడ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని వీహెచ్ తెలిపారు. ఇక్కడ తెలంగాణలోనూ ఇదే జరగబోతున్నదని వివరించారు. పార్టీలో కొన్ని అంతర్గతంగా సమస్యలు వస్తున్నాయని, కానీ, వాటిని అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.

Also Read: పోర్న్ వీడియోలు చూడాలని భార్యకు వేధింపులు..అలాగే చేయాలని బలవంతం.. చివరకు ఏం జరిగిందంటే?

రానున్న రోజుల్లో బీసీ గర్జన పేరుతో తమ బలం చూపిస్తామని వీ హనుమంతరావు అన్నారు. తమ డిమాండ్స్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ముందు పెడతామని చెప్పారు. తాము అగ్ర కులాల నాయకులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే, పాత వారికి బీసీలకు సముచిత స్థానం కల్పించడం తమ డిమాండ్‌లలో ప్రధానమైనదని వివరించారు. బీసీలు గతంలో అవమానాలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్