Agnipath protest in Secunderabad ఇంటలిజైన్స్ వైఫల్యంతోనే సికింద్రాబాద్ లో విధ్వంసం: బండి సంజయ్

By narsimha lode  |  First Published Jun 17, 2022, 1:37 PM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ వైఫల్యమే కారణమని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలన్నారు. టీఆర్ఎస్ సహకారంతోనే విధ్వంసాలు సాగుతున్నాయన్నారు.


హైదరాబాద్: ఇంటలిజెన్స్ వైఫల్యంతోనే సికింద్రాబాద్ లో ఆర్మీ అభ్యర్ధుల విధ్వంసానికి కారణమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay ఆరోపించారు. శుక్రవారం నాడు Basaraకు వెళ్తున్న బండి సంజయ్ ను బిక్కనూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. Agneepath వల్ల Army అభ్యర్ధులకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. ఆర్మీ అభ్యర్ధులను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. 

రాష్ట్ర ప్రభుత్వమే శాంతి భద్రతల సమస్య సృష్టిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే విధ్వంసాలను పెంచిపోషిస్తుందని బండి సంజయ్ విమర్శించారు. విధ్వంసాలకు పాల్పడే వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసం, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి టీఆర్ఎస్ సహకారం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. విధ్వంసం జరిగితే స్పందించవద్దని పోలీసులకు టీఆర్ఎస్ సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్టు కన్పిస్దుందని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.

Latest Videos

undefined

కేంద్ర ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బండి సంజయ్ విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన చెప్పారు. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. ఇంత జరుగుతున్నా కూడా సీఎం కేసీఆర్ అచేతన వ్యవస్థలో ఉన్నాడని బండి సంజయ్  చెప్పారు.  తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు టీఆర్ఎస్ , కాంగ్రెస్, ఎంఐఎం లు కలిసి విధ్వంసాలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.  సికింద్రాబాద్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలన్నారు. ఈ ఘటనతో ఆర్మీ అభ్యర్ధులకు సంబంధం లేదన్నారు. 

ఆర్మీలో చేరాలనే కోరికే ఉన్నతమైందన్నారు. ఆర్మీలో  ఉద్యోగం కోసం  ఆరాటపడుతున్న అభ్యర్ధులను అభినందించారు. దేశ రక్షణ కోసం దేశ భక్తులుగా మారి ఆర్మీలో చేరడానికి ప్రయత్నిస్తున్న అభ్యర్ధులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదన్నారు. మీ ఉద్యోగాలు, మీ భవిష్యత్తును కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టత ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. తప్పుదారి పట్టించే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ కోరారు. 

ఆర్మీలో చేరాలనుకొనేవారి భవిష్యత్తును నాశనం చేయాలనే ఆలోచన మోడీకి గానీ, కేంద్ర ప్రభుత్వానికి ఉండదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. మన ఆస్తులను మనమే ధ్వంసం చేసుకోవద్దని  బండి సంజయ్ కోరారు. ఆర్మీస్టూడెంట్స్‌ ముసుగులో కొంత మంది వ్యక్తులు వచ్చి రైళ్లు దగ్దం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.ఇదంతా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు.. ఇంత జరిగినా నీ ఇంటెలిజెన్స్‌ ఏమైందని ప్రశ్నించారు. అందుకే రాష్ట్రంలో బుల్డోజర్‌ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్మీ విద్యార్థులకు ఈ ఘటనతో ఏం సంబంధం లేదన్నారు.. మోడీ మీకు అన్యాయం చేసే వ్యక్తి కాదన్నారు.. మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేస్తారన్నారు.ఏ విధ్వంసం జరిగినా విద్యార్థులు వెళ్లొద్దని ఆయన కోరారు.

also read:Agnipath protest in Secunderabad: అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆర్మీ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధులు  రైళ్లపై రాళ్లు రువ్వారు. రైళ్లలో ఉన్న ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. రైల్వే పట్టాలపై కూర్చుని   ఆందోళనకు దిగారు. రైలు పట్టాలపై నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు.   రైలు పట్టాలపై కూర్చొని ఆందోళనకారులు ఆందోళన చేస్తుండడంతో రైళ్లను నిలిపివేశారు అధికారులు. 

click me!