బండి సంజయ్ అరెస్ట్: పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీల నిరసన

By narsimha lode  |  First Published Apr 5, 2023, 2:43 PM IST

బండి సంజయ్ అరెస్ట్ పై  పార్లమెంట్ ఆవరణలో  బుధవారం నాడు   బీజేపీ ఎంపీలు  ఆందోళనకు దిగారు. 


హైదరాబాద్:  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ  పార్లమెంట్ ఆవరణలో  బీజేపీ ఎంపీలు  బుధవారంనాడు  నిరసనకు దిగారు. బండి  సంజయ్ అరెస్ట్ ను బీజేపీ ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు.  రాష్ట్ర ప్రభుత్వం  ఉద్దేశ్యపూర్కకంగానే   బండి సంజయ్ ను అరెస్ట్  చేసిందని  బీజేపీ ఎంపీలు  ఆరోపించారు.  రాష్ట్రంలో  పేపర్ల లీక్ ను  ప్రశ్నిస్తున్నందుకే  బండి సంజయ్ ను అరెస్ట్  చేశారని  బీజేపీ ఎంపీలు  ఆరోపించారు.  మరో వైపు   బండి సంజయ్ అరెస్ట్  ను నిరసిస్తూ  రేపు రాష్ట్ర వ్యాప్తంగా  ఆందోళనలు నిర్వహించనున్నట్టుగా బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్  ప్రకటించారు.

టెన్త్ క్లాస్  పేపర్ లీక్  కుట్ర కేసులో  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను   మంగళవారంనాడు  రాత్రి  కరీంనగర్ లో  పోలీసులు అరెస్ట్  చేశారు.  నిన్న రాత్రి  కరీంనగర్ నుండి బండి సంజయ్ ను  యాదాద్రి భువనగిరిలోని బొమ్మలరామారం  పోలీస్ స్టేషన్ కు తరలించారు.  ఇవాళ   ఉదయం  బొమ్మల రామారం  పోలీస్ స్టేషన్ నుండి  బండి సంజయ్  ను వరంగల్ కు తరలించారు.

Latest Videos

click me!