ఆ మహిళలు బాల్క సుమన్ ను ట్రాప్ చేయాలని చూశారు: సిఐ

Published : Jul 06, 2018, 02:40 PM IST
ఆ మహిళలు బాల్క సుమన్ ను ట్రాప్ చేయాలని చూశారు: సిఐ

సారాంశం

టీఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్ పై మహిళలు లైంగిక దాడి ఆరోపణలు చేశారనే వార్తలపై మంచిర్యాల ఎస్పీ వివరణ ఇచ్చారు. వారు ఎంపీని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయాలని చూసినట్లు ఆయన తెలిపారు.

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని మంచిర్యాల సీఐ మహేష్ స్పష్టం చేశారు. సంధ్య, విజేత అనే ఇద్దరు మహిళలు మార్ఫింగ్ ఫోటోలతో ఎంపీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. 

ఆ సంఘటనపై వారి మీద ఆరు నెలల క్రితమే కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దురుద్ధేశంతోనే వారు ఎంపీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలోనూ ఈ ఇద్దరు అమ్మాయిలు పలువురిని ఇలాగే మోసం చేశారని వెల్లడించారు. సంధ్య, విజేతలపై 2018 ఫిబ్రవరి 6న కేసు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఎంపీని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి లబ్ది పొందాలని చూశారని, ఎంపీ కుటుంబ సభ్యుల పోటోను మార్పింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారని సీఐ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ బంజారహిల్స్‌లోను కేసులు నమోదయ్యాయని, 420,  292 A, 419, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇరువురిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మహేష్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu
Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి