తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

Published : Jul 13, 2022, 03:00 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో విశ్వ హిందూ పరిషత్,  భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో విశ్వ హిందూ పరిషత్,  భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ  తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవతలను కీర్తించారని.. దీనిని రాజకీయంగా తప్పు పడుతూ ఆదివారం (జూలై 10) నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యానించారని వీహెచ్‌పీ, భజరంగ్ ధళ్ నాయకులు ఆరోపించారు. 

ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ భజరంగ్ దళ్, వీహెచ్‌పీ నాయకులు సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుని, తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు తెలిపాయి. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు