టీఆర్ఎస్‌లో పదవుల జోష్: టీఎస్ఆర్టీసీ ఛైర్మెన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం

By narsimha lode  |  First Published Sep 16, 2021, 1:51 PM IST


తెలంగాణ ఆర్టీసీ ఛైర్మెన్ గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. నామినేటేడ్ పోస్టును భర్తీ చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం ఇటీవలనే నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగానే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు.


హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఛైర్మెన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ ను నియమిస్తూ  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ కొనసాగుతున్నారు.బాజిరెడ్డి గోవర్ధన్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఆయనకు పేరుంది. 1954 డిసెంబర్ 8న సిరికొండ మండలం రావుట్లలో ఆయన జన్మించాడు.

1999 నుండి 2004 వరకు ఆర్మూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా, 2004 నుండి 2009 వరకు బాన్సువాడ నుండి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ బయటకు వచ్చి వైసీపీలో చేరిన తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్  కూడ వైసీపీలో చేరారు.

Latest Videos

2014 ఎన్నికలకు ముందు వైసీపీని వీడిన బాజిరెడ్డి గోవర్ధన్  టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో చేరి నిజామాబాద్ నుండి పోటీ చేసి డి.శ్రీనివాస్ పై ఆయన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కూడ ఆయన అదే స్థానం నుండి పోటీ చేసి నెగ్గారు.తెలంగాణలో నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ ను నియమించింది. తాజాగా ఆర్టీసీ ఛైర్మెన్ గా  బాజిరెడ్డి గోవర్ధన్ ను నియమించింది.సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఖాళీగా ఉన్న నామినేటేడ్ పోస్టులను భర్తీ చేస్తామని టీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే నామినేటేడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

click me!