లైంగిక వేధింపుల కేసులో డీఎస్ తనయుడు సంజయ్‌కు బెయిల్

Published : Aug 30, 2018, 06:05 PM ISTUpdated : Sep 09, 2018, 11:17 AM IST
లైంగిక వేధింపుల కేసులో డీఎస్ తనయుడు సంజయ్‌కు బెయిల్

సారాంశం

లైంగిక వేధింపుల కేసులో డీఎస్ తనయుడు సంజయ్‌కు బెయిల్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిజామాబాద్ నగరంలోని శాంకరీ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చదివే విద్యార్థినులు తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు

లైంగిక వేధింపుల కేసులో డీఎస్ తనయుడు సంజయ్‌కు బెయిల్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిజామాబాద్ నగరంలోని శాంకరీ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చదివే విద్యార్థినులు తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు.

ఏకంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో.. సంజయ్‌ను అదుపులోకి తీసుకోవాల్సిందిగా హోంమంత్రి నిజామాబాద్ పోలీసులను ఆదేశించారు. కొద్దిరోజులు అజ్ఞాతంలో గడిపిన తర్వాత లాయర్‌తో కలిసి సంజయ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించారు. తాజాగా సంజయ్ బెయిల్ కోసం పిటిషన్ వేయడంతో జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?