పాతబస్తీలో మెట్రో కావాలంటూ నిరసన.. జేఏసీ నేతల అరెస్ట్

By sivanagaprasad KodatiFirst Published Aug 30, 2018, 5:24 PM IST
Highlights

పాతబస్తీలో యుద్ధప్రాతిపదికన మెట్రోరైలు నిర్మించాలనిన కోరుతూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నిర్వహించిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకుని.. వారిని అరెస్ట్ చేశారు.

పాతబస్తీలో యుద్ధప్రాతిపదికన మెట్రోరైలు నిర్మించాలనిన కోరుతూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నిర్వహించిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకుని.. వారిని అరెస్ట్ చేశారు. మెట్రో సాధన కోసం సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ పార్టీలతో ఏర్పాటైన జేఏసీ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి ఫలక్‌నూమా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఫ్లకార్డులు, జెండాలు పట్టుకుని పాతబస్తీలో మెట్రో నిర్మించాలని... అణచివేత, నిర్బంధకాండలు, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని జేఏసీ నేతలు అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పాతబస్తీలో మెట్రోరైల్ నిర్మాణం చేపట్టి తీరుతామని ప్రకటించి.. మాట తప్పారని వారు ఆరోపించారు. కావాలనే ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి పాతనగన అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. 

click me!