మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇలాకాలో టీఆర్ఎస్‌కు షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన బడంగ్‌పేట్ మేయర్..

Published : Jul 03, 2022, 12:06 PM ISTUpdated : Jul 03, 2022, 12:08 PM IST
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇలాకాలో టీఆర్ఎస్‌కు షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన బడంగ్‌పేట్ మేయర్..

సారాంశం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రకటించారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపడం జరిగిందని మీడియాకు వెల్లడించారు. బడంగ్ పేట అభివృద్ధి కాంక్షించి టీఆర్ఎస్‌లో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకు పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని చెప్పారు. క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకితభావంతో తాము సేవలందించామని తెలిపారు. అయితే కొంతకాలంగా తమ పట్ల వ్యతిరేక భావనతో ఉండటంతో.. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా వెల్లడించారు. 

ఇక, తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా పారిజాత నర్సింహారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని ఆమె అన్నారు. ఆమెతో పాటు కొందరు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. మరోవైపు వీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే సమాచారం తెలియడంతో.. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. 

మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో ఇటీవల పలువురు నేతలు టీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతుండటం ఆమెకు ఇబ్బందికర పరిస్థితిగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?