కాంగ్రెస్ లో చేరిన బడంగ్ పేట మేయర్: టీఆర్ఎస్‌సై రేవంత్ రెడ్డి ఫైర్

By narsimha lode  |  First Published Jul 4, 2022, 4:55 PM IST

బడంగ్ పేట మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పారిజాత నర్సింహరెడ్డి దంపతులు సోమవారం నాడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  రెండున్నర ఏళ్లుగా తాము అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోయామన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఆమె వివరించారు. 
 


న్యూఢిల్లీ: కేసీఆర్ సర్కార్ పై  విశ్వాసం కోల్పోయిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.బడంగ్ పేట మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పారిజాత నర్సింహ్మారెడ్డి దంపతులు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పారిజాత నర్సింహ్మరెడ్డి దంపతులు. నిన్న పారిజాత నర్సింహ్మారెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా సమర్పించారు.

 ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ Revanth Reddy  సోమవారం నాడు సాయంత్రం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. KCR తో కలిసి పనిచేస్తే ప్రజల సమస్యలను పరిష్కరించలేని పరిస్థితులున్నాయన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. Congress పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం ద్వారా ఉమ్మడి AP రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు సాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటు నగర శివారు ప్రాంతాలకు Krishna జలాలు, Godavari జలాలు, రోడ్ల వెడల్పు వంటి కార్యక్రమాలను  కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బస్తీల్లోని పేదలకు పెన్షన్లు, ఐఎవై కింద పేదలకు ఇళ్ల నిర్మాణం, Hyderabad కు మెట్రో రైల్ , అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కంపెనీలను తీసుకురావడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

Latest Videos

undefined

హైద్రాబాద్ ను విశ్వనగరంగా చేస్తామని ప్రకటించిన TRS సర్కార్  అందమైన అబద్దాలతో అధికారం చేపట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రోడ్లకు మరమ్మత్తులు కూడా టీఆర్ఎస్ సర్కార్ చేయలేని దుస్థితిలో ఉందని రేవంత్ రెడ్డి  విమర్శించారు.

కేసీఆర్ పై నమ్మకం కోల్పోయిన Badangpet మున్సిపల్ కార్పోరేషన్ Mayor పారిజాత నర్సింహ్మరెడ్డి తో పాటు కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీలోకి Rahul Gandhi సాదరంగా స్వాగతం పలికారని రేవంత్ రెడ్డి చెప్పారు. 

BJP నేతృత్వంలోని Narendra Modi  సర్కార్  నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచిందన్నారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. బతకడమే కష్టంగా మారిందన్నారు. దేశంలో శాంతి సామరస్యం నెలకొనే పరిస్థితులే లేవన్నారు. 

మరో వైపు KCR  నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కూడా అప్పుల పాలైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం దివాళా తీసిందన్నారు. తెలంగాణలో అభివృద్ది కుంటుపడిందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలని రాహుల్ గాంధీ తమకు చెప్పారన్నారు. 

టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన బడంగ్ పేట మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పారిజాత నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ  గత రెండున్నర ఏళ్లుగా టీఆర్ఎస్ కార్యకలాపాల్లో తాను చురుకుగా పాల్గొన్నట్టుగా చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేక తాము కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటున్నట్టుగా పారిజాత నర్సింహ్మరెడ్డి చెప్పారు.  గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి  విజయం సాధించినప్పటికీ కొన్ని కారణాలతో టీఆర్ఎస్ లో చేరామన్నారు. 

click me!