తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కు చేదు అనుభవం

Published : Jan 04, 2020, 04:47 PM IST
తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కు చేదు అనుభవం

సారాంశం

టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కు చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తుండగా పువ్వాడ అజయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యాలయం తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ భవన్ లోకి వస్తుండగా ఆయనను పోలీసులు తనిఖీ చేశారు. 

పోలీసుల చర్యకు పువ్వాడ అజయ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ ఘటనపై తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. టీఆర్ఎస్ విస్తృత సమావేశానికి హాజరు కావడానికి ఆయన శనివారం తెలంగామ భవన్ కు వచ్చారు.

Also Read: మీ పదవులు పోతయ్: మంత్రులకు కేసీఆర్ వార్నింగ్

వచ్చే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మార్గనిర్దేశం చేయడానికి కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిలా పరిషత్ చైర్ పర్సన్ లు, కార్పోరేషన్ చైర్ పర్సన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఆ సమావేశానికి వెళ్తుండగా పువ్వాడ అజయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే విషయంపై కేసీఆర్ సమావేశంలో మార్గనిర్దేశం చేశారు. మంత్రులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?