
హైదరాబాద్ : హైదరాబాద్ బాచుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో రెండో తరగతి చదువుతున్న పాప మృతి చెందింది. తండ్రితో టూ వీలర్ మీద స్కూలుకు వెళుతున్న సమయంలో బైకు గుంతలో పడింది. దీంతో బైక్ పై నుంచి జారి కింద పడిపోయింది చిన్నారి. అదే సమయంలో అటుగా వస్తున్న స్కూల్ బస్సు చిన్నారిపై నుంచి వెళ్ళింది. బాచుపల్లి రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.