మహబూబాబాద్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. బస్సులో 30మంది విద్యార్థులు..

Published : Aug 02, 2023, 10:24 AM IST
మహబూబాబాద్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. బస్సులో 30మంది విద్యార్థులు..

సారాంశం

మహబూబాబాద్ జిల్లాలో 30మంది విద్యార్థులతో వెడుతున్న ఓ స్కూలు బస్సు బోల్తా పడింది. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో బుధవారం ఉదయం ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. గ్రామం నుంచి పిల్లలను స్కూలుకు తీసుకువస్తుండగా ప్రమాదం జరిగింది. 

బస్సులోని విద్యార్థులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విద్యార్థులు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. టర్నింగ్ లో అదుపుతప్పి బోల్తాపడ్డ నలంద స్కూల్ బస్సు. 

హైదరాబాద్ హబ్సీగూడాలో భారీ అగ్ని ప్రమాదం.. అత్తాపూర్ లో మరో ఘటన..

దీనిమీద విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ.. రోజూ అంతే స్పీడ్ గా వెడతాడని.. కాస్త మెల్లగా వెళ్లమని చెప్పినా వినిపించుకోడని తల్లిదండ్రులు అంటున్నారు. ‘స్కూల్ బస్సు లో బాగా సౌండ్ పెట్టి.. స్పీడ్ గా తీసుకెళ్తాడు’ అని విద్యార్థులు చెబుతున్నారు.  
డ్రైవర్ పేరు ఎన్ పురుషోత్తం అని తెలుస్తోంది. దీనిమీద మరన్ని వివరాలు తెలియాల్స ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే