పాప దొరికింది: బీదర్‌కు బయలుదేరిన చిన్నారి కుటుంబసభ్యులు

First Published Jul 3, 2018, 6:26 PM IST
Highlights

సుఖాంతమైన కిడ్నాప్: చిన్నారి కోసం బీదర్ వెళ్లిన పేరేంట్స్

హైదరాబాద్: కోఠి ప్రభుత్వాసుపత్రి నుండి కిడ్నాపైన ఆరు రోజుల పసికందు బీదర్ ప్రభుత్వాసుపత్రిలో లభ్యమైంది. ఈ పసికందు ఆచూకీని  పోలీసులు కనుగొన్నారు.బీదర్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న పసిపాపను హైద్రాబాద్‌కు తీసుకువచ్చేందుకు కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో మంగళవారం సాయంత్రం బయలుదేరారు.

బీదర్ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఆరు రోజలు పసిపాపను క్షేమంగా ఉందని గుర్తించారు.  బీదర్‌ లో పసిపాపను వైద్యులు పరీక్షించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడ లేవని తేల్చారు. పాప తండ్రి, నానమ్మ , ఇతర కుటుంబసభ్యులలు ప్రత్యేక అంబులెన్స్‌లో బీదర్‌కు బయలుదేరారు.

సోమవారం నాడు  ఉదయం పూట టీకా వేయించేందుకు విజయ అనే మహిళ క్యూలో ఉన్న సమయంలో తాను సహాయం చేస్తానని ఓ మహిళ పసిపాపను కిడ్నాప్ చేసింది. ఆ మహిళ బీదర్‌కు తీసుకెళ్లి ఆ పసిపాపను బీదర్ ప్రభుత్వాసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది.

విజయకు ఇప్పటికే  ఓ కొడుకు ఉన్నాడు. రెండోసారి కూతురు పుట్టింది. ఏడేళ్ల తర్వాత ఆ కుటుంబంలో మరో చిన్నారి వచ్చింది. దీంతో ఆ కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారు. కానీ, ఓ మహిళ ఆ చిన్నారిని కిడ్నాప్ చేయడంతో  కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కర్ణాటక పోలీసుల సహాయంతో పాటు టెక్నాలజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.

పోలీసులు ఒత్తిడి పెరగడంతో పసిపాపను కిడ్నాప్ చేసిన మహిళ బీదర్ ప్రభుత్వాసుపత్రిలో పసిపాపను వదలేసి వెళ్లిపోయింది.అయితే కిడ్నాప్ ఎవరు చేసిందనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.


 

click me!