విమానంలో పురిటినొప్పులు, ఆగమేఘాల మీద స్పందించిన అపోలో

Siva Kodati |  
Published : May 14, 2019, 10:05 AM IST
విమానంలో పురిటినొప్పులు, ఆగమేఘాల మీద స్పందించిన అపోలో

సారాంశం

విమానంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రసవం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 8న రియాద్ నుంచి మనీలా వెళ్తున్న ఫిలిప్పీన్స్ విమానంలో ఫిలిప్పీన్స్ పౌరురాలికి పురిటి నొప్పులు వచ్చాయి. 

నొప్పులు మరింత తీవ్ర మవుతుండటంతో మహిళ పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటాన్ని గమనించాడు పైలట్. ఆ సమయంలో భారత గగనతలంలో విమానం ప్రయాణిస్తోంది. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ఏటీసీని సంప్రదించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు అనుమతి తీసుకున్నాడు.

అంతకంటే ముందే ఎయిర్‌పోర్ట్ అధికారులు అపోలో ఆసుపత్రి వైద్య సిబ్బందికి తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న వైద్యులు విమానం ల్యాండ్ అయిన వెంటనే సదరు మహిళ కూర్చొన్న సీటు వద్దకు వెళ్లి సాధారణ కాన్పు చేశారు.

ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భద్రతా కారణాలతో విమానంలోకి సర్జికల్ బ్లేడ్లకు అనుమతి లేకపోవడంతో బొడ్డు తాడును వేరుచేయలేకపోయారు. మరింత మెరుగైన చికిత్స నిమిత్తం తల్లి, బిడ్డలను జూబ్లీహిల్స్‌లోనీ అపోలో ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?