Babu Mohan: బాబుమోహన్ కంటతడి.. మంత్రి హరీష్ పై సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగింది? 

Published : Nov 25, 2023, 03:53 AM ISTUpdated : Nov 25, 2023, 07:05 AM IST
Babu Mohan: బాబుమోహన్ కంటతడి.. మంత్రి హరీష్ పై సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగింది? 

సారాంశం

Babu Mohan: ఆందోల్  నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబుమోహన్ కంటతడి పెట్టారు. అధికార బీఆర్ఎస్ తనను ఓడించేందుకు కుట్రలు చేస్తోందని ఆగ్రహం చేశారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ పై సంచలన వ్యాఖ్యలు  చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు బాబుమోహన్ కంటతడి పెట్టుకున్నారు. 

Babu Mohan: ఆందోల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సినీ నటుడు బాబుమోహన్ శుక్రవారం కంటతడి పెట్టారు. శుక్రవారం నాడు రాయికోడ్ మండలంలో  ఎన్నిక  ప్రచారం నిర్వహిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికలకు కొన్నిరోజుల ముందు తన కొడుకును అధికార బీఆర్ఎస్ తమ పార్టీలో చేరడంతో ఆయన కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికార బీఆర్ఎస్ పార్టీ  తండ్రీకొడుకులను వేరుచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తనను ఓడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నరనీ, మంత్రి హరీశ్ రావు తన కుటుంబాన్ని విడదీసి ఆగ్రహనికి గురయ్యారు. తన కొడుకు మెడలో బీఆర్ఎస్ కండువా కప్పి ఆనందిస్తున్నారని విమర్శించారు. కాగా బాబుమోహన్ తనయుడు ఉదయ్ బాబుమోహన్ ఐదు రోజుల క్రితం హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ తండ్రి కొడుకులను విడగొట్టిందని కంటతడి పెట్టుకున్నారు. 

తన కుటుంబాన్ని విడదీసి సిద్దిపేటలో తన కొడుకు మెడలో బీఆర్ఎస్ కండువా కప్పుతావా అంటూ మంత్రి హరీష్ రావును ప్రశ్నించారు. తన కొడుకు పేరు ఉదయ్ భాస్కర్ ... ఉదయ్ బాబుమోహన్ కాదనీ, తన పేరును రాజకీయంగా దురుద్దేశంతో వాడుకోవాలని చూస్తే ఖబర్ధర్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. తన కొడుకు టికెట్ అడిగితే తాను త్యాగం చేసేవాడిని ఆవేదనకు లోనయ్యారు. తాను పిలిస్తే పలుకుతాననీ,  బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటెయ్యండి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?