సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం నాడు మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖాధికారులు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. జూలై 1 నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తుతారు. అక్టోబర్ 28 వ తేదీ తర్వాత బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసివేస్తారు. గోదావరి నదిలో వరద నీరు దిగువకు వచ్చేలా గేట్లను ఎత్తాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ గేట్లు ఎత్తారు.
కరీంనగర్: Babli project గేట్లు శుక్రవారం నాడు ఎత్తారు. Maharashtra, Telanganaకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. బాబ్లీ ప్రాజెక్టుకు చెందిన 14 gates ఎత్తి 0.94 TMC ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రతి ఏటా జూలై 1 వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారు.
ప్రతి ఏటా జూలై 1 వ తేదీ నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఉంచుతారు. Godavari నదిపై బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో ఉత్తర తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అప్పట్లో వాదించింది.
ఈ విషయమై Supreme Court లో న్యాయ పోరాటం చేసింది. అయితే సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కార్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. వర్షాకాలం సమయంలో వరద నీరు దిగువకు విడుదల చేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఏటా జూలై 1 నుండి అక్టోబర్ నెలాఖరు వరకు వరద నీరు దిగువకు విడుదల చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తాలని కోరింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన ఇరిగేషన్ అధికారులు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు.