ముంబైలో జగిత్యాల వాసి కిడ్నాప్: రూ. 15 లక్షలు చెల్లించాలని బెదిరింపు

By narsimha lode  |  First Published Jul 1, 2022, 9:27 AM IST

జగిత్యాల జిల్లా నందగిరికి చెందిన శంకరయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.  ఈ ఏడాది జూన్ 22న దుబాయ్ నుండి శంకరయ్య  ముంబైకి వచ్చాడు.  శంకరయ్యను గుర్తు తెలియని  వ్యక్తులు కిడ్నాప్ చేశారు. శంకరయ్యను కట్టేసిన ఫోటోను నిందితులు బాధిత కుటుంబ సభ్యులకు షేర్ చేశారు.
 


కరీంనగర్: Jagtial జిల్లాలోని నందగిరికి చెందిన Sankaraiah  అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు Kidnap చేశారు. రూ. 15 లక్షలు ఇస్తేనే శంకరయ్యను విడిచిపెడతామని కిడ్నాపర్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంకరయ్యను కట్టేసిన photo ను కూడా నిందితులు కుటుంబ సభ్యులకు Whats App  ద్వారా చేరవేశారు. 

Dubai నుండి శంకరయ్య ఈ ఏడాది జూన్ 22న Mumbaiకి చేరుకున్నాడు. ముంబై ఎయిర్ పోర్టు నుండి శంకరయ్య బయటకు వస్తున్న సమయంలోనే నిందితులు ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా  తెలుస్తుంది. శంకరయ్య కొడుకుకు డబ్బుల కోసం కిడ్నాపర్లు బెదిరించారు. అతి పేద కుటుంబమైన తాము ఈ డబ్బులను ఎలా చెల్లిస్తామని శంకరయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest Videos

undefined

ఎక్కడికి డబ్బులు తీసుకు వస్తారో చెప్పాలని కూడా బాధితుడి కుటుంబ సభ్యులను  కిడ్నాపర్లు సభ్యులను అడిగారు. ఇంటర్నెట్ పోన్ ద్వారా కిడ్నాపర్లు మాట్లాడినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  ముంబై ఎయిర్ పోర్టు   వద్ద ట్యాక్సీ ఎక్కే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శంకరయ్యను కిడ్నాప్ చేశారు. ఈ విషయమై  కిడ్నాపర్లు మూడు రోజుల క్రితం కూడా శంకరయ్య కొడుకు హరీష్ కు సమాచారం ఇచ్చారు.

దీంతో  శంకరయ్య కొడుకు హరీష్ ముంబైకి వెళ్లి పోలీసులకు పిర్యాదు చేశాడు. శంకరయ్య ఎక్కడ ఉన్నాడనే దానిపై పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. శంకరయ్య ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. దుబాయ్ నుండి కరీంనగర్ కు వస్తున్న సమయంలో ముంబైలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాపర్లు కిడ్నాప్ చేశారు.  దుబాయ్ నుండి వచ్చిన శంకరయ్య వద్ద డబ్బులున్నాయనే అనుమానంతో కిడ్నాప్ చేశారని కూడా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. శంకరయ్య వద్ద ఉన్న బ్యాగుల్లో డబ్బులు లేకపోవడంతో  డబ్బుల కోసం తమకు ఫోన్ చేసి బెదరిస్తున్నారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

మహారాష్ట్ర నుండి శంకరయ్యను తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.  కిడ్నాపర్లు తమిళం, మళయాళ భాషల్లో మాట్లాడుతున్నారని శంకరయ్య కుటుంబ సభ్యులు చెప్పారు. శంకరయ్యను కొట్టి ఆసుపత్రిలో చికిత్స చేయించినట్టుగా కూడా కిడ్నాపర్లు తమకు ఫోన్ లో చెప్పారని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. కిడ్నాపర్లు డిమాండ్ చేసిన రూ. 15 లక్షల చెల్లించే స్థోమత తమ వద్ద లేదని శంకరయ్య భార్య అంజవ్వ మీడియాకు చెప్పారు. తన భర్తను సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని ఆమె పోలీసులను కోరుతున్నారు.

శంకరయ్యను కిడ్నాపర్లు తమిళనాడుకు తరలిస్తున్నారనే అనుమానంతో ముంబై పోలీసులు తమిళనాడు రాష్ట్రానికి బయలుదేారారు. శంకరయ్యను ఎవరు కిడ్నాపర్ చేేశారనే విషయమ ఇంకా అంతుబట్టడం లేదని  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు ఎవరిపై అనుమానం లేదని కూడా బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 
 

click me!