షర్మిలతో అజారుద్దీన్ కొడుకు భేటీ: సానియా మీర్జా సోదరి సైతం

Published : Mar 19, 2021, 01:01 PM ISTUpdated : Mar 19, 2021, 01:21 PM IST
షర్మిలతో అజారుద్దీన్ కొడుకు భేటీ: సానియా మీర్జా సోదరి సైతం

సారాంశం

వైఎస్ షర్మిలతో హైద్రాబాద్ లోటస్ పాండ్ లో మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తో పాటు సానియా మీర్జా  సోదరి శుక్రవారం నాడు భేటీ అయ్యారు.

హైదరాబాద్:  వైఎస్ షర్మిలతో హైద్రాబాద్ లోటస్ పాండ్ లో మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తో పాటు సానియా మీర్జా  సోదరి శుక్రవారం నాడు భేటీ అయ్యారు.

తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం కోసం షర్మిల ఏర్పాట్లు చేసుకొంటుంది.ఈ తరుణంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో ఆమె సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమయంలో అజారుద్దీన్ కొడుకు షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. గతంలోనే అజారుద్దీన్ కొడుకుకు సానియా మీర్జా సోదరికి వివాహం అయిన విషయం తెలిసిన విషయం తెలిసిందే.

వీరిద్దరూ  షర్మిలతో ఎందుకు భేటీ అయ్యారనే విషయమై ప్రాధాన్యత సంతరించుకొంది.ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో నిర్వహించే సభలో పార్టీని షర్మిల ప్రకటించే అవకాశం ఉంది.ఈ సభ నిర్వహణ కోసం ఆమె సన్నాహలు చేసుకొంటున్నారు. ఈ సభకు పోలీసుల నుండి అనుమతి కూడ తీసుకొంది.

ఆయా జిల్లాల్లో ఉన్న రాజకీయపరిస్థితుల గురించి ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల ఆధారంగా  పార్టీ నిర్మాణంలో ఆమె నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు