పంచాయితీ ఎన్నికలు నిలిపివేయాలి: హైకోర్టులో పిటిషన్ దాఖలు

By Arun Kumar PFirst Published Jan 1, 2019, 8:06 PM IST
Highlights

ఎన్నో అడ్డంకులను దాటుకుని ఇవాళ తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది.అయితే ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. బిసి రిజర్వేషన్లను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తే బీసీ సంఘం నేత ఆర్‌ కృష్ణయ్య ఇవాళ హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

గతంలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా బిసిలకు కేటాయించిన రిజర్వేషన్లను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఎన్నికల ప్రక్రియను చేపడుతోందని కృష్ణయ్య ఆరోపించారు. 34 శాతం వున్న రిజర్వేషన్లను 22 తగ్గించడం వల్ల బిసిలకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలో అధికంగా వున్నబిసి జనాభా అత్యల్ప స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కృష్ణయ్య తన పిటిషన్ లో పేర్కొన్నారు.  

తెలంగాణ రాష్ట్రంలో  మూడు విడతలుగా గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించనున్నట్టు  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి షెడ్యూల్ విడుదల చేసిన రోజే  ఈ
పిటిషన్ దాఖలవ్వడం రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఈ పిటిసన్ పై కోర్టు తీర్పును బట్టి పంచాయితీ ఎన్నికల భవితవ్యం ఆధారపడనుంది. 

మరిన్ని వార్తలు

గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పోలింగ్

click me!