పురుగుల మందు తాగి నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం...

Published : Oct 17, 2018, 12:45 PM ISTUpdated : Oct 17, 2018, 12:49 PM IST
పురుగుల మందు తాగి నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం...

సారాంశం

ఉద్యోగ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే  అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లా పూర్‌ మండలంలోని సోమశిల గ్రామానికి చెందిన బాల స్వామి, అలివేలు దంపతుల రెండో కుమారుడు శ్యాంకుమార్‌. ఇతడు డిగ్రీ పూర్తి చేసుకొని కానిస్టేబుల్‌ పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పరీక్ష కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. 

అయితే ఇటీవల జరిగిన వ్రాత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో అర్హత మార్కులు సాధించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్యాం మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే వారు శ్యాంను నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందడంతో అతడి పరిస్థితి మెరుగుపడింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌