కరీంనగర్ : పొలం దున్నుతూ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. రైతు గల్లంతు

Siva Kodati |  
Published : Jul 07, 2022, 09:42 PM IST
కరీంనగర్ : పొలం దున్నుతూ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. రైతు గల్లంతు

సారాంశం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడిన ఘటనలో రైతు గల్లంతయ్యాడు. గురువారం పొలం పనుల్లో భాగంగా దుక్కి దున్నతుండగా అదుపు తప్పి ట్రాక్టర్ తో సహా భావిలో పడ్డాడు శంకర్.   

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడిన ఘటనలో రైతు గల్లంతయ్యాడు. బాధితుడిని శంకర్ గా గుర్తించారు. ఇతని స్వస్థలం మానకొండూరు మండలం బంజేరుపల్లెగా తెలుస్తోంది. గురువారం పొలం పనుల్లో భాగంగా దుక్కి దున్నతుండగా అదుపు తప్పి ట్రాక్టర్ తో సహా భావిలో పడ్డాడు శంకర్. నీరు ఎక్కువగా వుండటంతో బావిలో శంకర్ గల్లంతయ్యాడు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నీరు ఎక్కువగా వుండటంతో గల్లంతైన వ్యక్తి కోసం క్రేన్ లు తెప్పిస్తున్నారు. కాగా... దళిత బంధు కింద ఇటీవలే శంకర్ ట్రాక్టర్ తీసుకున్నాడు. అంతలోనే ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్