14 ఏళ్ల తర్వాత హరీష్ తో జగ్గారెడ్డి భేటీ: మతలబు ఏమిటి?

By narsimha lodeFirst Published Sep 20, 2019, 7:19 AM IST
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తారు. హరీష్ రావుపై ఒంటికాలితో లేచే జగ్గారెడ్డి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. గురువారం నాడు అసెంబ్లీ లాబీల్లో ఆర్ధిక మంత్రి హరీష్ రావుతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. 

హరీష్ రావు ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందు ఆయనపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పట్ల కొంత సానుకూల వ్యాఖ్యలు చేస్తూనే అదే సమయంలో హరీష్ రావు పట్ల తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

అంతేకాదు సంగారెడ్డి నియోజకవర్గానికి అన్యాయం చేసింది హరీష్ రావే అంటూ కూడ జగ్గారెడ్డి గతంలో ఆరోపణలు చేశారు.30 నిమిషాల పాటు వీరిద్దరూ చర్చించారు.

జిల్లా అభివృద్దితో పాటు తన నియోజకవర్గంలో సమస్యల విషయమై మంత్రి హరీష్ రావుతో చర్చించినట్టుగా జగ్గారెడ్డి చెబుతున్నారు. వీరిద్దరూ కూడ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు.  దివంగత మాజీ కేంద్ర మంత్రి ఆలే నరేంద్రతో కలిసి జగ్గారెడ్డి బీజేపీ నుండి గతంలో టీఆర్ఎస్ లో చేరారు.

ఆ తర్వాతి కాలంలో జగ్గారెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం కూడ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జగ్గారెడ్డి కేసీఆర్ కు అనుకూలంగా కొన్ని సార్లు జగ్గారెడ్డి మాట్లాడారు.

కేసీఆర్ వల్లే తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా జగ్గారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో వ్యాఖ్యానించారు.  2008లో కేవీపీ ద్వారా కాంగ్రెస్ లో చేరేందుకు హరీష్ రావు ప్రయత్నాలు చేశారని జగ్గారెడ్డి ప్రకటించారు. 


 


 

click me!