జల్సాల కోసం చోరీలు, భర్తకు సహకరించిన భార్య: హైద్రాబాద్‌లో ఆటో డ్రైవర్ అరెస్ట్

By narsimha lodeFirst Published Dec 27, 2020, 12:17 PM IST
Highlights

జల్సాలకు  అలవాటు పడిన ఓ వ్యక్తి తన భార్య సహకారంతో చోరీలు  చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

హైదరాబాద్: జల్సాలకు  అలవాటు పడిన ఓ వ్యక్తి తన భార్య సహకారంతో చోరీలు  చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కడ్తాల్ మండలం మైసిగండికి చెందిన సభావత్ పాండు, గుజ్రి దంపతులు కొంతకాలంగా చంపాపేట్ లోని మారుతీనగర్ లో నివాసం ఉంటున్నారు.

పాండు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్.  అయితే జల్సాలకు అలవాటు పడిన పాండు. దొంగతనాలను చేయడం ప్రారంభించాడు.  దొంగతనాలతో సులువుగా డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు.

నాగార్జునసాగర్-హైద్రాబాద్ రహదారిపై చౌదరిపల్లి గేటు వద్ద శుక్రవారం నాడు అనుమానాస్పదంగా తిరుగుతున్న పాండును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టుగా గుర్తించామని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ చెప్పారు. నిందితుడి నుండి రూ. 12.45 లక్షలు విలువ చేసే బంగారం, వెండి నగలతో పాటు నగదున, ఓ టీవీని స్వాధీనం చేసుకొన్నారు. 

2001లో ఆమనగల్లులో రెండు, 2009లో వనస్థలిపురంలో రెండు, 2012లో ఆమనగల్లులో రెండు, 2014 లో యాచారంలో, 2020లో కంచన్ బాగ్, కందుకూరులలో రెండు చోరీలకు పాల్పడ్డారు. ఈ కేసుల్లో అరెస్టై జైలుకు వచ్చినా కూడ అతని తీరులో మార్పు రాలేదన్నారు.

చోరీల్లో పాండు దోచుకొచ్చిన నగలను ఆయన భార్య గుజ్రి విక్రయించేది. నగలను విక్రయించి డబ్బులను భర్తకు అందించేది.  బంగారు నగలను కొనుగోలు చేసిన ఇద్దరు జ్యూయల్లరీ దుకాణాల యజమానులపై కూడ కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

click me!