వ్యాపారికి అమ్మాయిని ఎరగా వేసి ఆటో డ్రైవర్ చేసిన పని ఇదీ...

Published : May 04, 2019, 08:06 AM IST
వ్యాపారికి అమ్మాయిని ఎరగా వేసి ఆటో డ్రైవర్ చేసిన పని ఇదీ...

సారాంశం

గాంధీనగర్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీకి చెందిన చంద్రశేఖర్‌ వ్యాపారం చేస్తున్నాడు. మెట్టుగూడ కేశవనగర్‌కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ సంతోష్‌ తో అతడికి పాత పరిచయం ఉంది. ఈనెల 2న చంద్రశేఖర్‌కు ఫోన్‌ చేసిన సంతోష్‌ తన వద్ద ఓ అమ్మాయి ఉందని చెప్పి తన ఇంటికి పిలిచాడు.

హైదరాబాద్: ఓ వ్యాపారికి ఆటో డ్రైవర్ అమ్మాయిని ఎరగా వేసి దారుణానికి పాల్పడ్డాడు. వ్యాపారిపై దాడి చేసి అతని మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఈ  సంఘటన సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. 

పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. గాంధీనగర్‌ ఎస్‌బీహెచ్‌ కాలనీకి చెందిన చంద్రశేఖర్‌ వ్యాపారం చేస్తున్నాడు. మెట్టుగూడ కేశవనగర్‌కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ సంతోష్‌ తో అతడికి పాత పరిచయం ఉంది. ఈనెల 2న చంద్రశేఖర్‌కు ఫోన్‌ చేసిన సంతోష్‌ తన వద్ద ఓ అమ్మాయి ఉందని చెప్పి తన ఇంటికి పిలిచాడు.

తన ఇంటికి వచ్చిన చంద్రశేఖర్‌ను లోపలికి తీసుకుని వెళ్లి కర్రతో వెనుక నుంచి దాడి చేశాడు. కిందపడిపోయిన అతడి మెడలోని నాలుగుతులాల బంగారు గొలుసు లాక్కుని బయటి నుంచి తలుపు గడియపెట్టి పారిపోయాడు. 

బాధితుడి కేకలు విన్న స్థానికులు తలుపులు తీశారు. దాంతో అతను బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu