డెకాయిట్లంతా టీఆర్ఎస్ పార్టీలోనే... దమ్ముంటే రేవంత్ తో డైరెక్ట్ గా చూసుకొండి..: సిపిఐ నారాయణ

By Arun Kumar PFirst Published Sep 22, 2021, 5:33 PM IST
Highlights

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపైకి వచ్చి టీఆర్ఎస్ శ్రేణులు దాడికి యత్నించడాన్పి సిపిఐ నాయకులు నారాయణ ఖండించారు. 

హైదరాబాద్: తెలంగాణ పిసిసి (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటిపై టీఆర్ఎస్ (TRS) కార్యకర్తల దాడిని సిపిఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) ఖండించారు. అసలు డేకాయిట్లంతా టీఆర్ఎస్ లోనే ఉన్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమని నారాయణ అన్నారు. 

రేవంత్ రెడ్డి ఇంటి మీద దాడిని అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తోంది. ఇంకో సారి దాడులకు తెగబడితే వారి సంగతి చూస్తాం. దమ్ముంటే డైరెక్ట్ గా రావాలి... అప్పుడు చూసుకుందాం. కానీ ఇలా దొంగచాటుగా ఇళ్లపై దాడులకు తెగబడటం దారుణం'' అని నారాయణ మండిపడ్డారు.  

రాష్ట్రంలో కొన్నాళ్లుగా టాలీవుడ్ డ్రగ్స్‌కు సంబంధించిన కేసు చర్చనీయాంశమైంది. ఇదే డ్రగ్స్‌పై పొలిటికల్ వార్ మొదలైంది. కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వైట్ చాలెంజ్ రాజకీయంగా దుమారం రేపుతున్నది. కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య వాగ్యుద్ధం టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణకు దారితీసింది. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు కొందరు మంగళవారం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి. రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి.

read more  విశ్వనగరం కాదు.. విషనగరంగా మార్చారు, రేవంత్ ఇంటిపై దాడిని ఖండించిన మధుయాష్కీ

తాము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే రేవంత్ అనుచరులు తమపై దాడి చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఇంటిపైకి దాడిచేయడానికి వచ్చిన వారిని అడ్డుకున్నామని అంటున్నారు. పోలీసులు మాత్రం కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయగా ఇవాళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

రేవంత్ ఇంటిపైకి దాడికి టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించడాన్ని తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. దాడుల సంస్కృతిని తెలంగాణలో తీసుకురావద్దని... ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దని టీఆర్ఎస్ పార్టీని కోరుతున్నారు. 

click me!