దారి కాచి హెడ్‌‌మాస్టర్‌ ఫ్యామిలీపై దొంగల దాడి... నగదు, నగలు దోపిడి

Siva Kodati |  
Published : Feb 13, 2021, 03:31 PM ISTUpdated : Feb 13, 2021, 04:53 PM IST
దారి కాచి హెడ్‌‌మాస్టర్‌ ఫ్యామిలీపై దొంగల దాడి... నగదు, నగలు దోపిడి

సారాంశం

వికారాబాద్ జిల్లా హుమ్నాబాద్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. బండవెల్కి చెర్ల స్కూల్ హెడ్‌మాస్టర్‌పై దాడి చేసి నగదు, నగలు ఎత్తుకెళ్లారు. కుటుంబంతో కలిసి కారులో వెళ్తున్నారు హెడ్‌మాస్టర్ రాములు.

వికారాబాద్ జిల్లా హుమ్నాబాద్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. బండవెల్కి చెర్ల స్కూల్ హెడ్‌మాస్టర్‌పై దాడి చేసి నగదు, నగలు ఎత్తుకెళ్లారు. కుటుంబంతో కలిసి కారులో వెళ్తున్నారు హెడ్‌మాస్టర్ రాములు.

ఇదే అదనుగా భావించిన దొంగలు... రోడ్డుకి అడ్డంగా మేకులు వేశారు. దీంతో కారు పంక్చరై బోల్తా పడింది. ఆ తర్వాత దొంగలు హెడ్‌మాస్టర్ రాములు కుటుంబంపై దాడి చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, నగలు అపహరించుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వికారాబాద్‌ జిల్లా బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కె.రాములు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ రమేశ్‌. వీరిద్దరూ తమ కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో వెళ్లారు.

షిర్డీ యాత్ర ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. కర్నాటకలోని వాసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి రాగానే దొంగలు వీరి కారును అడ్డగించారు. రోడ్డుపై మేకులు వేసి కారు పంక్చరయ్యేలా చేశారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu