రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. యాదవ సంఘం సభ్యుల డిమాండ్..

Published : May 15, 2023, 05:23 PM IST
రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. యాదవ సంఘం సభ్యుల డిమాండ్..

సారాంశం

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని పలు యాదవ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని పలు యాదవ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవ సంఘం సోమవారం ఆందోళనకు దిగింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేసింది. మంత్రి తలసానిని ఉద్దేశిస్తూ పెండ పిసుక్కోనే వాడని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు యావత్ యాదవ జాతిని కించపరిచే విధంగా ఉన్నాయని యాదవ సేవ సంఘం సభ్యులు ఆరోపించారు. 

రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనాదిగా అణగారిన వర్గాలపై అగ్రకులాల వ్యక్తులు అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వైఖరి  మార్చుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఆయనను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?