అధికారం, పదవులపైనే కాంగ్రెస్‌ నాయకుల దృష్టి.. : బీఆర్ఎస్

By Mahesh Rajamoni  |  First Published Nov 15, 2023, 2:30 AM IST

BRS: దీపావళి విరామం తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభించిన కేసీఆర్.. గంగానది వంటి ప్రధాన నదులు ప్రవహించే రాష్ట్రాల్లో ఇప్పటికీ తాగునీరు సమస్యగా ఉందన్నారు. అయితే, దేశంలో ప్రతి గిరిజన ఆవాసానికి తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నొక్కిచెప్పారు. 
 


Telangana Assembly Elections 2023: ముచ్చ‌ట‌గా మూడోసారి వరుసగా అధికారంలోకి రావాల‌ని చూస్తున్న భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ముమ్మరంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేటలోని దేవిడి, తబేలా, వికార్ నగర్, భగవంతపూర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మ‌రోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రచారం సందర్భంగా తలసాని అన్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Videos

undefined

కాంగ్రెస్‌పై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్.. 

కాంగ్రెస్‌ పార్టీ గత హయాంలో రైతులకు కేవలం రెండు గంటలే కరెంటు ఇచ్చిందని సూర్యాపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తూ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకు స‌వాలు విసురుతున్నారు.పేదల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఉద్ఘాటించారు. ఇప్పటికే ఆరుసార్లు కంటే ఎక్కువసార్లు ఓటేసిన గ్రామస్తులు అభ్యర్థుల సామర్థ్యాలను, అర్హతలను క్షుణ్ణంగా విశ్లేషించి వారి సంక్షేమం కోసం నిజాయితీగా కృషి చేసే వారిని ఎన్నుకోవాలని ఆయన కోరారు. రైతులు ఎన్ని కష్టాలు పడినా కాంగ్రెస్ తన అవకాశాన్ని వృధా చేసిందనీ, రైతులను ఎలా నిర్లక్ష్యం చేసిందనేది వివ‌రిస్తూ గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ నాయకుల దృష్టి అధికారం, పదవులపైనే ఉందని ఆరోపించారు. కానీ, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల భూముల సారాన్ని బీఆర్‌ఎస్‌ విజయవంతంగా ఎలా పెంచిందో ఆయన ఎత్తిచూపారు. దేశంలోనే ఎన్నికల మేనిఫెస్టోలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే కేసీఆర్ ధ్యేయమని స్ప‌ష్టం చేశారు.

click me!