ఆరోగ్య సిబ్బందికి ఇన్సెంటివ్ ఇవ్వాలి: బండి సంజయ్

Published : May 13, 2021, 04:56 PM IST
ఆరోగ్య సిబ్బందికి ఇన్సెంటివ్ ఇవ్వాలి: బండి సంజయ్

సారాంశం

ఆరోగ్య సిబ్బందికి ఇన్సెంటివ్ ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

కరీంనగర్: ఆరోగ్య సిబ్బందికి ఇన్సెంటివ్ ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్ గురువారం నాడు పరిశీలించారు.  ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రుల్లో 20 మంది నర్సులను తాత్కాలిక ప్రాతిపదికన రిక్రూట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

తాను మూడు నెలల జీతాన్ని ముందుగానే ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని  ఆయన చెప్పారు. కేంద్రం సహాయం చేయడానికి సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ స్వాగతిస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు  తెలంగాణ రాస్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 నుండి  లాక్‌డౌన్ ను అమల్లోకి తీసుకొచ్చారు. 10 రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.  ఈ నెల 20వ తేదీన మరోసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు  చేసి లాక్‌డౌన్ ను కొనసాగించాలా వద్దా అనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?