ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసం: ఆశోక్ ను అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

By narsimha lodeFirst Published May 25, 2022, 4:29 PM IST
Highlights

ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఆశోక్ అనే వ్యక్తిని హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడిపై హైద్రాబాద్ లో మూడు కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. 

హైదరాబాద్: MBBS సీట్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన Ashok  అన వ్యక్తిని  Hyderabad  సీసీఎస్ పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు.  కోల్ కత్తా, బెంగుళూరు, పుణెల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని చెప్పి  మోసాలకు పాల్పడుతున్న ఆశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కోల్‌కత్తా, పుణె, బెంగుళూరులలో కూడా ఆశోక్ కార్యాలయాలు  కూడా ఏర్పాటు చేశారని పోలీసులు చెప్పారు. హైద్రాబాద్ లో ఆశోక్ పై మూడు కేసులు నమోదైనట్టుగా పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి CCS పోలీసులు బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి  ఈ కేసు వివరాలను వెల్లడించారు.

 NEET ఎగ్జామ్ రాసిన వారిని లక్ష్యంగా చేసుకొని ఆశోక్ వారికి మంచి కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆశోక్  కొంత కాలంగా ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని  డబ్బులు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. కేసులు నమోదు కావడంతో ఆశోక్ Nepal కు పారిపోయాడు. నేపాల్ లో ఉంటున్న ఆశోక్ ను స్థానిక పోలీసుల సహాయంతో అరెస్ట్ చేసి హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు.
 

click me!